Hawala Cash Seized | రైలులో రూ.1.22 కోట్ల హవాల నగదు స్వాధీనం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hawala Cash Seized | రైలులో తరలిస్తున్న హవాలా నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

హవాలా, డ్రగ్స్​, గంజాయి ఇతర అక్రమ రవాణా కోసం నిందితులు రైళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో నిఘా తక్కువగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ (Secunderabad Railway Station) పరిధిలో భారీగా హవాలా డబ్బును పోలీసులు సీజ్​ చేశారు. ముంబై నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.1 కోటి 22 లక్షల 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Hawala Cash Seized | ప్రత్యేక తనిఖీలు

ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ (Devagiri Express) రైలులో బొల్లారం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ల మధ్య అధికారులు ఈ నెల 26న తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో హవాలా వ్యవహారం బయట పడింది. ఆ వ్యక్తి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని “కాంత జ్యువెలరీ” నిర్వహిస్తున్న సంతోష్ సేథ్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకు వస్తున్నట్లు నిందితుడు తెలిపారు.

ఈ డబ్బులను సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని “బంటి” అనే జ్యువెలరీ వ్యాపారికి అందజేయడానికి తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ డబ్బు తీసుకు వచ్చినందుకు విజయ్‌కు రూ.5 వేల కమీషన్ ఇస్తారని తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

devagiri

దీనిని కూడా చదవండి : Kamareddy police | ప్రేమించిన అమ్మాయి సోదరుల దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *