Kamareddy Mobile Recovery | మొబైల్స్ రికవరీలో కామారెడ్డి ప్రథమ స్థానం : ఎస్పీ రాజేష్ చంద్ర

మొబైల్ ఫోన్ల రికవరీలో కమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Mobile Recovery | మొబైల్ ఫోన్ల రికవరీలో కమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా రాష్ట్రంలోనే కామారెడ్డి(Kamareddy) జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు

Kamareddy Mobile Recovery | ప్రతినెలా 150కి పైగా ఫోన్ల రికవరీ..

జిల్లాలో ప్రతి నెలా 150కి పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నామని, ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 2.23 కోట్ల విలువైన 1,397 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. గత 45 రోజుల్లోనే రూ. 42.24 లక్షల విలువైన 264 ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది సుమారు రూ. 3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను బాధితులకు అందజేశామని గుర్తుచేశారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 5,678 ఫోన్లను ట్రాక్ చేసి, సుమారు రూ. 9.08 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించామని తెలిపారు.

Kamareddy Mobile Recovery | సీఐ సంపత్​ పర్యవేక్షణలో..

సీఐ సంపత్ పర్యవేక్షణలో, ఆర్ఎస్సై బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంకేతిక బృందం అత్యాధునిక పరిజ్ఞానంతో రికవరీ చేస్తోందని కొనియాడారు. మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆందోళన చెందవద్దని, వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సిమ్​ను బ్లాక్ చేయాలని, సీఈఐఆర్ పోర్టల్​లో ఐఎంఈఐ నంబర్​ను బ్లాక్ చేయాలని సూచించారు. పోయిన ఫోన్ల ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తు తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Kamareddy Mobile Recovery | అనుమానితులపై నిరంతర నిఘా ఉంచాలి

అనుమానితులపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం రాజంపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజంపేట పరిధిలో నేరాల తీరు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ తనిఖీలో భిక్కనూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్​ నరేష్, రాజంపేట ఎస్సై భువనేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: 55ఏళ్ల నా భూమి.. కాంగ్రెస్ నాయకుల కబ్జా.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *