Karregutta Hills | కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు ప్రవేశం లేదు : డీజీపీ

కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు ప్రవేశం లేదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Karregutta Hills | తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు ప్రవేశం లేదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ అన్నారు. ఆ ప్రాంతాన్ని ల్యాండ్‌మైన్‌లను తొలగించి, భద్రతా చర్యలు చేపట్టే వరకు అటువైపు వెళ్లొద్దని సూచించారు.

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల పరిధిలో కర్రెగుట్టలు ఉన్నాయి. ఈ అడవులను గతంలో మావోయిస్టులు షెల్టర్లుగా ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ ల్యాండ్​మైన్లు పెట్టారు. అంతేగాకుండా పలు ప్రాంతాల్లో ఆయుధాల డంప్​లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకు వెళ్లొద్దని డీజీపీ హెచ్చరించారు.

Karregutta Hills | డంప్​ల గుర్తింపు

లొంగిపోయిన మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస ప్యాకేజీ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ప్రెషర్ మైన్‌లతో సహా పలు రకాల మైన్‌లను అమర్చారని తెలిపారు. వాటి కచ్చితమైన స్థానాలు ఇంకా తెలియరాలేదన్నారు. లొంగిపోయిన కొందరు కేడర్లను విచారించిన అనంతరం తొమ్మిది మావోయిస్టు డంప్‌లను గుర్తించినట్లు తెలిపారు. మైన్‌లను తొలగించే ఆపరేషన్ పూర్తికాకముందే పర్యాటకులను కొండల్లోకి అనుమతిస్తే ప్రమాదాలు జరగవచ్చని, తీవ్రమైన ముప్పు వాటిల్లవచ్చని పేర్కొన్నారు.

Karregutta Hills | రూ.5.59 కోట్ల సాయం

ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నప్పటికీ, అన్ని మైన్‌లను తొలగించి, భద్రతా చర్యలు నిర్ధారించిన తర్వాతే పర్యాటకుల ప్రవేశానికి అనుమతిస్తామని తెలిపారు. కాగా గత ఏడాది కాలంలో లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద రూ. 5.59 కోట్లను డీజీపీ సోమవారం అందజేశారు. వీరు లొంగిపోయిన సమయంలో అందించిన ప్రాథమిక పరిహారానికి అదనంగా, వారికి వాగ్దానం చేసిన పునరావాస ప్యాకేజీలో భాగంగా ఈ మొత్తాన్ని చెల్లించారు.

దీనిని కూడా చదవండి : NIMS Hospital | నిమ్స్​ ఆస్పత్రిలో భారీగా అక్రమాలు.. ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *