IAS Rajiv Hanumanthu accident | కారు-స్కూల్ వ్యాన్ ఢీ.. ఐఏఎస్‌ రాజీవ్‌ హనుమంతుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం!

రాజీవ్ హనుమంతు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: IAS Rajiv Hanumanthu accident | తెలంగాణ Telangana రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ), సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు గాయాలపాలయ్యారు.

IAS Rajiv Hanumanthu accident | దైవదర్శనం ముగించుకుని వస్తుండగా..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని, అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో నెల్లూరు జిల్లా చాపరాళ్లపల్లి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఒక స్కూల్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.

IAS Rajiv Hanumanthu accident | నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం

రెండు వాహనాలు ఢీకొన్న ధాటికి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద తీవ్రతకు రాజీవ్ హనుమంతు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనలో ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతుతో పాటు కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.

IAS Rajiv Hanumanthu accident | హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి కారులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను తొలుత సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మరింత మెరుగైన వైద్య సేవల కోసం వారిని నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

IAS Rajiv Hanumanthu accident | మంత్రి పొంగులేటి పరామర్శ

ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతు కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.

రాజీవ్ హనుమంతుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *