అక్షరటుడే వెబ్‌డెస్క్: Philips Festive Offer | గత పండుగల సీజన్‌లో ‘సోనే పే సుహాగా’ ప్రచారానికి లభించిన అపూర్వ విజయంతో ఉత్సాహపడిన ‘ఫిలిప్స్ హోమ్ అప్లయన్సెస్’ (Versuni) ఈసారి పండుగ షాపింగ్‌ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు సరికొత్త భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ‘సోనే పే డబుల్ సుహాగా’ పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. సాధారణ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులకు భిన్నంగా అర్హత కలిగిన కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతులతో పాటు బంగారం, వజ్రాలు గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.
Philips Festive Offer | ఆఫర్ వివరాలు ..
ఈ పండుగల ప్రచారం అక్టోబరు 11 నుండి నవంబరు 11, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 112 నగరాల్లో దాదాపు 20 కోట్ల మందికి పైగా వినియోగదారులకు చేరువ కావాలని ఫిలిప్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచార కాలంలో కనీసం రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అర్హత గల ఫిలిప్స్ హోమ్ అప్లయన్సెస్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ ఆఫర్‌కు అర్హులు. ప్రతీ కొనుగోలుపై ఖచ్చితమైన గ్యారంటీ బహుమతి లభిస్తుంది.
Philips Festive Offer | లక్కీ ఛాన్స్..
ఈ ఆఫర్ కింద కస్టమర్లు గ్యారంటీ బహుమతులతో పాటు ప్రతి గంటకు రూ.9,999 విలువైన బంగారం లేదా ప్రతి రోజూ రూ.50,000 విలువైన వజ్రం (Diamond) గెలుచుకునే అవకాశం పొందుతారు. పండుగ షాపింగ్‌ను మరింత డిఫరెంట్‌గా, ప్రయోజనకరమైన అనుభవంగా మార్చేందుకే సాధారణ డిస్కౌంట్లకు భిన్నంగా ఈ భారీ బహుమతులను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్పందన:
ఈ ప్రత్యేక ఆఫర్ గురించి ‘వెర్సుని ఇండియా’ (Versuni India) చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పూజా బైద్ మాట్లాడుతూ.. “గతంలో తెచ్చిన ‘సోనే పే సుహాగా’ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సాధారణ తగ్గింపుల కంటే కస్టమర్లకు నిజమైన సంతోషాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చే పండుగ కార్యక్రమాలను వారు కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ‘సోనే పే డబుల్ సుహాగా’ తీసుకువచ్చాం. ఖచ్చితమైన బహుమతులతో పాటు బంగారం, వజ్రాలు గెలుచుకునే అవకాశం కల్పించడం ద్వారా పండుగ షాపింగ్‌ను మరింత ఉత్సాహంగా మార్చడమే మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat Speech | భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకల్లో భగవత్ హెచ్చరిక!