అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heat Increase | రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు వర్షాలు పడతాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.
వానాకాలం ప్రారంభమై 40 రోజులు అవుతోంది. అయినా భారీ వర్షాలు లేవు. నిన్నటి వరకు ఆకాశం మేఘావృతమై ఉంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. తూర్పు తెలంగాణ (Telangana)లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర తెలంగాణలో 34-36° డిగ్రీల టెంపరేచర్ రికార్డు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి.
Telangana Heat Increase | జులై 15 వరకు..
రుతుపవనాల విస్తరణలో తీవ్ర విరామం ఏర్పడనుంది. జులై 15 వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు. జులై 10-15 మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి తీవ్రత కారణంగా అక్కడక్కడా కొన్ని వర్షాలు పడవచ్చు. తెలంగాణలో జులై 20-31 మధ్య కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా వర్షాలు పడకపోతే తెలంగాణలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండనున్నాయి.
Telangana Heat Increase | పంటలకు అందని నీరు
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. చెరువులు, జలాశయాలు ఖాళీ అయ్యాయి. బోరు బావుల ఆధారంగా రైతులు పంటలు వేశారు. అయితే భూగర్భ జలాలు రోజు రోజుకు పాతాళంలోకి పడిపోతున్నాయి. దీంతో వేసిన పంటలకు నీరు అందడం లేదు. మరోవైపు కొత్తగా నాట్లు వేసే పరిస్థితి లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Police Transfers | భారీగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..30 మందికి స్థానచలనం