అక్షరటుడే, వెబ్డెస్క్ : Elephant Rampage | కేరళ (Kerala)లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. త్రిస్సూర్ నగరంలో బంధించబడిన ఒక ఏనుగు శనివారం నియంత్రణ కోల్పోయి నివాస ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆగ్రహించిన ఏనుగు అదుపు తప్పడంతో, పాదచారులు వాహనదారులు భయంతో పరుగులు తీశారు. ఏనుగు దాడిలో అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఓ కారులో మహిళ ఉండగా ఏనుగు దానిని తలకిందులుగా చేసింది. అది వెళ్లిపోయిన తర్వాత స్థానికులు ఆ మహిళను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయట పడ్డారు.
Elephant Rampage | ఆస్తి నష్టం
ఏనుగును నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దానిని బంధించి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టాన్ని కలిగించడంతో పాటు, పట్టణ ప్రాంతాలలో బంధించబడిన ఏనుగుల సంరక్షణలో భద్రతా చర్యలపై ఆందోళనలను రేకెత్తించింది.
Panic gripped #Thrissur city this morning, after a captive #Elephant , turned violent and ran amok through several busy and residential areas, causing widespread damage.
According to eyewitnesses, the agitated elephant broke control, sending pedestrians and motorists fleeing.… pic.twitter.com/KbcQb625Wx
— Surya Reddy (@jsuryareddy) May 23, 2026
దీనిని కూడా చదవండి: Odisha Fire Accident | జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం


