అక్షరటుడే, వెబ్‌డెస్క్: Netflix Subscription Price | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platform) నెట్‌ఫ్లిక్స్ మరోసారి తన సబ్‌స్క్రిప్షన్ రేట్లతో వార్తల్లో నిలిచింది.
క్వాలిటీ కంటెంట్ అందించడంలో ముందున్న ఈ సంస్థ, ధరల విషయంలో మాత్రం వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉంది. ఇటీవల అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ (Netflix) వరుసగా ధరలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. యాడ్స్‌తో స్ట్రీమింగ్ చేసే బేసిక్ ప్లాన్‌ను సుమారు 9 డాలర్లకు, యాడ్స్ లేని ప్లాన్‌ను 20 డాలర్లకు పెంచగా, ప్రీమియం ప్లాన్ ధర ఏకంగా 27 డాలర్లకు చేరింది. ఏడాదిలో రెండుసార్లు ధరలు పెంచడం వినియోగదారుల్లో అసంతృప్తిని కలిగించింది.
Netflix Subscription Price | అదనపు భారం..
అమెరికా (America)లో ధరల పెంపు జరిగిన కొద్ది కాలానికే ఇతర దేశాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయడం నెట్‌ఫ్లిక్స్‌కు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా త్వరలో సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరగవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఇప్పటికే భారత మార్కెట్‌లో ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ఖరీదైనదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ధరలు Rates పెరిగితే సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Netflix Subscription Price | పైరసీ వైపు మళ్లే ప్రమాదం
మరోవైపు, ధరలు అధికమైతే వినియోగదారులు పైరసీ వైపు మళ్లే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటెంట్ క్వాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నెట్‌ఫ్లిక్స్, ధరల విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తన వినియోగదారుల సంఖ్యపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ Market వర్గాలు భావిస్తున్నాయి. అంటే క్వాలిటీ కంటెంట్‌తో పాటు ధరల సమతౌల్యం పాటించాల్సిన అవసరం నెట్‌ఫ్లిక్స్ ముందు ఉందని చెప్పాలి. భారత్‌లో రేట్ల పెంపు జరిగితే వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Mega Family | మెగా ఫ్యామిలీకి కలిసి రాని 2026.. ఈ ఏడాది వరుస సర్జరీలతో అభిమానుల్లో ఆందోళన, త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

