Nizamabad Census Process | జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడ, నిజామాబాద్​ సిటీ: Nizamabad Census Process | జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector ila tripathi) ఆదేశించారు. జన గణనలో భాగంగా కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను (house listing survey) కలెక్టర్ శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Nizamabad Census Process | గౌతంనగర్​, ఆర్యనగర్​లలో..

గౌతంనగర్, ఆర్య నగర్ టెలికాం కాలనీలలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ (nizamabad collector) ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్ల గుర్తింపు కార్డులు ధరించారా లేదా అన్నది గమనించారు. వారు జనగణన విధులు నిర్వర్తిస్తున్న తీరును పరిశీలించి, ఇప్పటివరకు హౌస్​ లిస్టింగ్ ఎంతశాతం పూర్తయ్యిందనే వివరాలు తెలుసుకున్నారు. స్వీయ గణన చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జనగణన కోసం వెళ్లే సమయంలో క్యూఆర్ కోడ్​తో జారీ చేయబడిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా జనగణన జరపాలని అన్నారు. జనగణనకు సంబంధించి ప్రగతిని తెలియజేస్తూ రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సూపర్​వైజర్లు హన్మాండ్లు, సాయిరాం, ఎన్యూమరేటర్లు భాగ్యలక్ష్మి, రాము తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: CSR Support Schools | సర్కార్​ బడులకు కార్పొరేట్​ సంస్థల చేయూత.. సీఎం సమక్షంలో ఒప్పందం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *