PSU Q4 Results | క్యూ4లో అదరగొట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు.. లాభాల్లో ఎల్‌ఐసీ టాప్‌

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PSU Q4 Results | గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన కంపెనీలలో లాభాల్లో ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Life Insurance Corporation of India) అగ్రస్థానంలో నిలిచింది. నాలుగో త్రైమాసికంలో రూ. 23,400 కోట్ల నికర లాభం నమోదు చేయడం ద్వారా ఫైనాన్షియల్‌ రంగంలో అత్యధిక లాభం నమోదుచేసిన కంపెనీగా ఆవిర్భవించింది. ఎస్‌బీఐ రూ.19,684 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

PSU Q4 Results | ఇతర సంస్థలు..

క్యూ4లో ఇతర ప్రభుత్వ రంగసంస్థలు సైతం రాణించాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రూ. 11,378 కోట్లు, కోల్‌ ఇండియా రూ. 10,839 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ. 8,598 కోట్లు, ఎన్టీపీసీ రూ. 8,747 కోట్లు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ రూ. 4,546 కోట్లు, ఆర్‌ఈసీ రూ. 3,375 కోట్ల చొప్పున నికర లాభాలను నమోదు చేశాయి.

PSU Q4 Results

PSU Q4 Results | వార్షిక ప్రాతిపదికన అగ్రస్థానంలో ఎస్‌బీఐ

వార్షిక ప్రాతిపదికన మాత్రం ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 80,032 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ఎల్‌ఐసీ రూ.57,419 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి..: Today Gold Rates | మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా రేట్లు, ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *