జాబ్స్​ & ఎడ్యుకేషన్​Scholarship Deadline | విద్యార్థులకు ఊరట.. స్కాలర్​​షిప్​ దరఖాస్తు గడువు పొడిగింపు

Scholarship Deadline | విద్యార్థులకు ఊరట.. స్కాలర్​​షిప్​ దరఖాస్తు గడువు పొడిగింపు

విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scholarship Deadline | తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఈ-పాస్ (E pass) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించింది.

దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పొడిగింపు కొత్త దరఖాస్తులతో పాటు, రెన్యువల్​ చేసుకునే అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే 10.20 లక్షలకు పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, వివిధ కారణాల వల్ల దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. దీంతో తాజాగా ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Scholarship Deadline | సాంకేతిక సమస్యలతో..

గత ఏడాది నమోదులతో పోలిస్తే 68,597 మంది విద్యార్థులు స్కాలర్​షిప్​కు తక్కువగా దరఖాస్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ విద్యార్థులు గడువు తేదీలోగా తమ దరఖాస్తును నమోదు చేసుకోలేకపోయారు. ఏప్రిల్ మొదటి వారంలో మీ-సేవా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

దీనిని కూడా చదవండి : NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీ.. ఎన్​టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...

భారత్‌లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టుమారో మేకర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోద్రేజ్ ఫౌండేషన్

వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త జాతీయ...

Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు...

Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aaya Share Song | నేచురల్ స్టార్...