తెలంగాణHeavy Rain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు దక్షిణ, మధ్య తెలంగాణ (Telangana)లోని జిల్లాల్లో అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలు ప్రధాన హాట్‌స్పాట్‌గా ఉంటాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన విస్తృత తుఫానులు, 50-60 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు పడే ఛాన్స్​ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Heavy Rain Alert | ఈ జిల్లాలకు అలర్ట్

ఉమ్మడి మెదక్​, కామారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్డి, నల్గొండ, నాగర్​ కర్నూల్​, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమొదురు వానలు పడుతాయి. సోమవారం సాయంత్రం సైతం మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్​ నగరంలో రాబోయే 48 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయి.

Heavy Rain Alert | రైతుల ఆందోళన

గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో వానలు పడుతున్నాయి. దీంతో ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కాంటా చేసిన బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. ఈ సమయంలో వర్షాలు పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Bhadradri Accident | కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన రోడ్డు ప్రమాదం.. కోమాలో తల్లిదండ్రులు, అన్నకు అంత్యక్రియలు చేసిన చెల్లెలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు...

Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత...

Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్: Working Women Safety | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...

Odisha Septic Tank Tragedy | ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఆరుగురు కూలీల మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Odisha Septic Tank Tragedy | ఒడిశాలోని కలహండి...