Jawaharlal Nehru Services | దేశానికి జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు మరువలేనివి..

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Jawaharlal Nehru Services | దేశానికి తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ చేసిన సేవలు మరువలేనివని డీసీసీ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలోని కాంగ్రెస్​ భవన్ (Congress Bhavan)​లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ పార్క్​లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేశారు.

Jawaharlal Nehru Services | ఇతర దేశాలతో పోటీ పడేవిధంగా..

ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్న దేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టితో చేసిన అనేక సంస్కరణల వల్లే నేడు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. దేశంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారని, వ్యవసాయం అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు నిర్మించారన్నారు. జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి సౌకర్యం ఆయన హయాంలోనే సాధ్యమైందన్నారు. యువతకు మెరుగైన విద్య కోసం ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేశారన్నారు.

Jawaharlal Nehru Services | నెహ్రూను తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారని

1964 మే 27న ఆయన కన్ను మూశారన్నారు. కాని ప్రస్తుతం దేశంలో ఉన్న బీజేపీ నాయకులు నెహ్రూను తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆకాశంపై ఉమ్మివేస్తే ఏమవుతుందో వారు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్​ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, కోఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ నరేందర్, శివ చరణ్, జిల్లెల రమేష్, మల్యాల గోవర్దన్, కోనేరు సాయి కుమార్, ఆదె ప్రవీణ్, రాజ్, ముశ్షు పటేల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Police | నగరంలో దొంగ హల్​చల్​.. పలు ఇళ్లల్లో దోపిడీ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *