Gandhi Bhavan Clash | గాంధీభవన్‌లో హైడ్రామా.. వేదికపైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gandhi Bhavan Clash | హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్‌’ (Gandhi Bhavan) రసాభాసగా మారింది. బుధవారం నిర్వహించిన హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ప్రోటోకాల్ వివాదం కాస్తా ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది.

Gandhi Bhavan Clash | వేదికపైనే చెంపదెబ్బ..

సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ హజ్రీ మధ్య ప్రోటోకాల్ విషయంలో మొదట మాటల యుద్ధం నడిచింది. అది కాస్తా క్షణాల్లో శృతిమించి తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఉస్మాన్‌ హజ్రీ.. ఫిరోజ్‌ ఖాన్‌ను అందరి ముందే చెంపదెబ్బ కొట్టి, స్టేజ్ పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘర్షణను ఆపేందుకు, ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (VH) ప్రయత్నించారు. అయితే గొడవ పడుతున్న నేతలు ఆయనను కూడా పక్కకు తోసేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ghandhi.1

Gandhi Bhavan Clash | అర్ధాంతరంగా వెళ్ళిపోయిన మంత్రులు..

సొంత పార్టీ నేతలే బహిరంగంగా కొట్టుకోవడంతో సమావేశానికి హాజరైన మంత్రులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గాంధీభవన్‌లో గందరగోళం మిన్నంటడంతో చేసేదేమీ లేక మంత్రులు సమీక్షా కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని, అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ghandhi.2

ఇది కూడా చదవండి: Karnataka CM Change | కర్ణాటక రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. రేపే సీఎం సిద్ధరామయ్య రాజీనామా!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *