అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Security | బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. బుధవారం భిక్కనూరు(Bhikkanoor) పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Bakrid Security | వాహనాలను తనిఖీ చేయాలి
వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయాలని.. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు.
రాత్రివేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది ట్రాఫిక్ బెటాలియన్, రిఫ్లెక్టివ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పండుగ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ తనిఖీలో డీఎస్పీ మధుసూదన్, సీఐ శివ, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.
Bakrid Security | రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

జాతీయ రహదారి పక్కనే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి(devunipally) పోలీసులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను(Devunipalli Police Station) తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ, స్టేషన్ పరిధిలోని నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలపై ఎస్‌హెచ్‌వో రంజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Bakrid Security | 44వ జాతీయ రహదారిపై..
44 వ జాతీయ రహదారి స్టేషన్ పరిధిలో వెళ్తున్నందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి రాత్రి గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని తెలిపారు. నేరాలు జరగక ముందే అప్రమత్త చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడంతో పాటు అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా యువతలో సైబర్ సేఫ్టీపై చైతన్యం కల్పించాలన్నారు.
పోలీస్‌స్టేషన్ పరిశుభ్రతపై..
పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డయల్-100 కాల్స్‌కు వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి(Kamareddy) డీఎస్పీ మధుసూదన్, రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: OPPO A6c 5G | తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్..


