సినిమాRaaka Movie Music | పాన్ వరల్డ్ మూవీ ‘రాకా’పై ఒక్క‌సారిగా పెరిగిన అంచనాలు.. ఇంటర్నేషనల్...

Raaka Movie Music | పాన్ వరల్డ్ మూవీ ‘రాకా’పై ఒక్క‌సారిగా పెరిగిన అంచనాలు.. ఇంటర్నేషనల్ లెవల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్న టీం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్, సౌండ్ ట్రాక్‌తో హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకార్ చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raaka Movie Music | పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ ‘రాకా’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియా (Social Media)లో సెన్సేషన్‌గా మారింది.

తాజాగా విడుదల చేసిన థీమ్ సౌండ్ ట్రాక్ కూడా అభిమానులను ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంక‌ర్ (Sai Abhyankkar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాకా’ మ్యూజిక్‌ను పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలని టీం నిర్ణయించుకుందని ఆయన తెలిపారు. మొదటిసారి దర్శకుడు అట్లీతో సమావేశమైనప్పుడు సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సౌండ్ డిజైన్ ఎలా ఉండాలి అన్న దానిపై క్లియర్ విజన్ ఉందని చెప్పారు. ఆ దిశగా తాను రూపొందించిన ట్రాక్ హీరో అల్లు అర్జున్‌కు కూడా ఎంతో నచ్చిందని వెల్లడించారు.

Raaka Movie Music | భారీగా పెరిగిన అంచ‌నాలు…

ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇంటర్నేషనల్ సింగర్స్, రైటర్స్‌తో కలిసి పని చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. కథ విన్న తర్వాతే ఆల్బమ్ ఎలా ఉండాలి అన్నదానిపై తాను ప్రేరణ పొందానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా స్టోరీపై పలు ఆసక్తికర థియరీలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ‘రాకా’ (Raka)అనే పదానికి నిండు పౌర్ణమి అనే అర్థం ఉండటంతో, చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చే యోధుడిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొందరు మాత్రం పగలు మనిషిగా, రాత్రి తోడేలుగా మారే పాత్రలో కనిపిస్తారని ఊహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ కలిపి రూపొందిస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

Raaka Movie Music

Raaka Movie Music | అధికారిక ప్రకటన..

చిత్రీకరణ ఇప్పటికే వేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని దర్శకుడు అట్లీ భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా VFX కోసం అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో కలిసి పని చేస్తుండటంతో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ప్రేక్షకులకు అందుతాయని టాక్. ఈ భారీ చిత్రాన్నిక‌ళానిధి మార‌న్ (Kalanithi Maran) సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, నేషనల్ క్రష్ ర‌ష్మిక మంధాన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....