బిజినెస్​Stock Market Today | ఊగిసలాటలో మార్కెట్లు.. ఫ్లాట్‌గా కదలాడుతున్న సూచీలు

Stock Market Today | ఊగిసలాటలో మార్కెట్లు.. ఫ్లాట్‌గా కదలాడుతున్న సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల నష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market Today | కాల్పుల విరమణను పొడిగించేందుకు, హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానంపై ఆంక్షలను సడలించేందుకు అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. అయితే మన మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో స్తబ్ధుగా ఉన్నాయి.

Stock Market Today | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 171 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 403 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 31 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 131 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 75,917 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద ఉన్నాయి.

Stock Market Today | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు..

దీనికితోడు ఏఐ వినియోగాన్ని పెంచేందుకు విప్రో ఒక అమెరికన్ సంస్థతో భాగస్వామ్యాన్ని నెలకొల్పిన నేపథ్యంలో ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఏజెంటిక్ ఏఐ వర్క్‌ఫ్లోలను అమలు చేయడానికి సర్వీస్ నౌతో భాగస్వామ్యం కుదుర్చుకున్న విప్రో షేరు ధర ఇంట్రాడేలో గరిష్టంగా 5 శాతం వరకు పెరిగింది. ఐటీ సూచీ 2.7 శాతం లాభపడింది. దీంతో భారత బెంచ్‌మార్క్ సూచీలు ప్రారంభ నష్టాలనుంచి కోలుకుని ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి.

Stock Market Today | మిక్స్‌డ్ గా సూచీలు..

నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 2.47 శాతం, రియాలిటీ 1.33 శాతం, టెలికాం 0.85 శాతం, మీడియా 0.67 శాతం లాభాలతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 0.79 శాతం, ఎనర్జీ 0.56 శాతం, మెటల్ 0.52 శాతం, ఆటో 0.50 శాతం, యుటిలిటీ 0.46 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.41 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 3.78 శాతం, టెక్ మహీంద్రా 2.42 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.67 శాతం, ఎల్టీ 1.29 శాతం, టీసీఎస్ 1.01 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇండిగో 2.31 శాతం, పవర్‌గ్రిడ్ 1.48 శాతం, ఎన్టీపీసీ 1.29 శాతం, టాటాస్టీల్ 1.26 శాతం, ఐటీసీ 1.06 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Bullet 650 | బుల్లెట్ 650.. ధర రూ. 3.65 లక్షలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...