అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mobile Food Court | దేశంలో ఎంతో మంది ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు లభించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో కొందరు యువత తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి ఉపాధి పొందుతున్నారు.
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు (Guntur) యువకులు స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఒక పాత కారును వినూత్నంగా మొబైల్ ఫుడ్ కోర్ట్‌గా మార్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి కోసం బొగ్గుల పొయ్యిపై కాల్చిన ‘ఆయిల్ లెస్ చికెన్ స్నాక్స్’ (Oil-free Chicken Snacks) అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీరి వినూత్న వ్యాపార ఆలోచన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Mobile Food Court | అనేక అవకాశాలు
ప్రస్తుతం ఉపాధి పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే యువత ఉద్యోగం గురించే ఆలోచిస్తున్నారు. స్వయం ఉపాధి, స్టార్టప్‌ల జోలికి వెళ్లడం లేదు. కొత్తగా ఆలోచించి వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు సాధించవచ్చు. క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే తాము ఉపాధి పొందడంతో పాటు పలువురికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు. అయితే వ్యాపారం, స్వయం ఉపాధి అనగానే చాలా మంది భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ లెస్ చికెన్ స్నాక్స్‌తో గుంటూరు యువత కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు లాభాలు ఆర్జిస్తున్నారు.
పాత కారులో ‘ఆయిల్ లెస్’ చికెన్.. గుంటూరు యువత సరికొత్త ట్రెండ్!
AP: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు యువకులు స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఒక పాత కారును వినూత్నంగా మార్చి మొబైల్ ఫుడ్ కోర్ట్‌గా మార్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి కోసం బొగ్గుల పొయ్యిపై… pic.twitter.com/vuSC1bIhWo
— ChotaNews App (@ChotaNewsApp) May 29, 2026
ఇది కూడా చదవండి..: Tirupati ASI Drunk | తిరుపతిలో మద్యం మత్తులో ఏఎస్సై హల్చల్


