అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha on BRS Meeting | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సోమవారం జగిత్యాలలో సభ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Former Minister Jeevan Reddy) గులాబీ పార్టీలోకి చేరారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకిని పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.
కవిత మంగళవారం మీడియాతో మాట్లాడారు. జగిత్యాల (Jagtial)లో బీఆర్ఎస్ సభపై సెటైర్లు వేశారు. తాము కొత్తగా పెట్టబోయే పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాని గురించి కనీసం ప్రస్తావించలదేని విమర్శించారు. బీఆర్ఎస్లో ఆడబిడ్డలకు గౌరవం ఉండదన్నారు.
Kavitha on BRS Meeting | బీఆర్ఎస్ మారదు
బీఆర్ఎస్ నాయకులు తమ ఓటమికి ప్రజలను తప్పు పడుతున్నారని ఆరోపించారు. జీవన్‌రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అన్నారు. అలాంటి వారిని రాజకీయ పునరేకీకరణ పేరు చెప్పి అలాంటి వారిని బీఆర్ఎస్ (BRS)లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. వెయ్యి ఏళ్లు అయిన ఆ పార్టీ మారదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల గురించి బీఆర్ఎస్ సభలో ఒక్క మాట లేదన్నారు.
Kavitha on BRS Meeting | సీఎంపై విమర్శలు
హరీశ్‌రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనపై మాట్లాడుతూ.. గుంటనక్క ఢిల్లీకి వెళ్లారన్నారు. దీనిపై గుంపు మేస్త్రీ మాట్లాడుతూ.. ఆయన ఎందుకోసం వెళ్లారో తనకు తెలుసు అంటున్నారని, అలాంటప్పుడు ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా సీజన్ అయిపోయిన తర్వాత వేశారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఎలా ఉంటారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయనందుకు అధికారంలో ఉంటారా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, అదే తోవలో కాంగ్రెస్ సైతం వెళ్తుందని విమర్శించారు.

Kavitha on BRS Meeting | ఆశీర్వదించండి
జాగృతి సంస్థగా ఉన్న తాము ఈ నెల 25న రాజకీయ పార్టీగా మారబోతున్నట్లు కవిత (Kavitha) తెలిపారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి ప్రజలు తరలి రావాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తాము కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త తరహా రాజకీయలు చేస్తామన్నారు. ఆడబిడ్డగా వస్తున్నానని ఆశీర్వాదించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Chandrababu Comments | రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

