Harish Rao | యాదవులను పట్టించుకోని ప్రభుత్వం : హరీశ్​రావు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం  యాదవులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట (Siddipet) పట్టణంలోని యాదవ సంఘం లో ఏర్పాటుచేసిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

Harish Rao | హరీశ్​రావు మాట్లాడుతూ..

కేసీఆర్​ హయాంలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. చట్టసభల్లో సైతం అవకాశం కల్పించామని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో కనీసం బీసీ కార్పొరేషన్ లేదని, బీసీల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

Harish Rao

మంచి పేరు తేవాలి..

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని హరీశ్​రావు సూచించారు. కుల సంఘాలు జాతి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చదువుకు కులం, పేదరికం అడ్డు కాదని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ పురస్కారాలు, అవార్డులు అందజేయడంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు.

Harish Rao

ఇది కూడా చదవండి..: Crime Control Measures |  నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి : డీజీపీ ఆనంద్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *