అక్షరటుడే, కామారెడ్డి/బాన్సువాడ: No Tobacco Day | ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
No Tobacco Day | భారీ ర్యాలీ..
కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన దంత వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా నుంచి ప్రారంభమై మున్సిపల్ కార్యాలయం మీదుగా తిరిగి నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకుంది. అనంతరం సిగరెట్ దిష్టిబొమ్మను దహనం చేసి కార్యక్రమాన్ని ముగించారు.
దురలవాట్ల బారినపడొద్దు
ఈ సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్ మాట్లాడుతూ.. పొగాకు, గుట్కా, సిగరెట్ వంటి దురలవాట్ల బారిన పడి యువత తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అలవాట్ల కారణంగా ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని.. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్, రాష్ట్ర బాధ్యులు డాక్టర్ సాజిద్, కామారెడ్డి జిల్లా కోశాధికారి డాక్టర్ కవిత, వినోద్, ప్రవీణ్, డాక్టర్ నాగరాజ్, పలువురు దంత వైద్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి


