అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana TET Schedule | తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్, టీజీటెట్ కన్వీనర్ నేడు విడుదల చేశారు. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో జరగనున్నాయి.
Telangana TET Schedule | రెండు సెషన్లలో పరీక్షలు..
పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు జరుగుతుంది. సెషన్-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతుంది. పూర్తి పరీక్షల షెడ్యూల్ వివరాలు https://schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Harish Rao | యాదవులను పట్టించుకోని ప్రభుత్వం : హరీశ్‌రావు


