తెలంగాణPonnam Prabhakar | కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసే ధైర్యం పవన్‌కు ఉందా?: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసే ధైర్యం పవన్‌కు ఉందా?: పొన్నం ప్రభాకర్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponnam Prabhakar | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ సమాజంపై పవన్ కల్యాణ్ తీవ్రమైన విషం కక్కారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కంటిచూపు పడితే కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతాయంటూ ఇక్కడి సమాజాన్ని అవహేళన చేసిన చరిత్ర పవన్‌ది అని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తట్టుకోలేక 11 రోజుల పాటు అన్నం తినకుండా ఏడ్చిన ఈ తెలంగాణ ద్వేషి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకుని ‘నవ నిర్మాణ సభలు’ నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా పవన్ కల్యాణ్ సభలను ఒప్పుకోరని, ఇక్కడ అడుగుపెట్టే ముందే ఆయన ఈ ప్రాంత ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ponnam.1

Ponnam Prabhakar | బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే పవన్ రాజకీయం..

తెలంగాణలో ఎలాగైనా అశాంతిని, విద్వేషాలను రేకెత్తించాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ ఇక్కడ అడుగుపెడుతున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని, వారి డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ ఈ కొత్త రాజకీయ నాటకానికి తెరలేపారని విమర్శించారు. “బీజేపీ ఇచ్చే ప్యాకేజీల కోసమే ఇక్కడికి రాలేదని కొండగట్టు ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పే ధైర్యం పవన్ కల్యాణ్‌కు ఉందా?” అని సవాల్ విసిరారు. ఏపీ ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. అక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, తన బాస్ ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే తెలంగాణలో సభలు పెడుతున్నారని నిలదీశారు. ఈ నవనిర్మాణ సభలను గుజరాత్, యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

 

ponnam.2

Ponnam Prabhakar | సొంత రాష్ట్ర సమస్యలను వదిలేసి..

పవన్ కల్యాణ్ రాజకీయ శైలిని మంత్రి పొన్నం పదునైన సామెతలతో ఎద్దేవా చేశారు. ఏపీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తుంటే నోరు మెదపని పవన్, కృష్ణపట్నం, గంగవరం వంటి కీలక పోర్టులను అదానీకి కట్టబెడుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, గ్యాస్, పెట్రోల్ ధరల వంటి ప్రజాసమస్యలపై మాట్లాడకుండా.. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా దేశభక్తిని నిరూపించుకోవాలని హితవు పలికారు. ఏపీలో సొంత సమస్యలను పరిష్కరించుకోలేని వారు, తెలంగాణకు వచ్చి ఏం ఉద్ధరిస్తారని దుయ్యబట్టారు.

Ponnam Prabhakar | అభిమానులకు మంత్రి కీలక సూచన..

సినిమా నటుడిగా పవన్ కల్యాణ్‌ను ఎవరైనా అభిమానించవచ్చని, ఆయన ఫ్యాన్స్ సినిమాలు చూసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పొన్నం పేర్కొన్నారు. అయితే, రాజకీయాల పేరుతో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎవరైనా జరుపుకోవచ్చని, పొరుగు రాష్ట్రంగా ఏపీపై తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పారు. యువతను కేవలం జై కొట్టడానికే పరిమితం చేయకుండా, కేంద్ర ప్రభుత్వం ద్వారా తన అభిమానులకు ఉద్యోగాలు ఇప్పించేలా పవన్ కల్యాణ్ చొరవ చూపాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్​కు ఫిర్యాదు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

June 03 Horoscope | నేటి రాశి ఫలాలు.. సరికొత్త అవకాశాలతో దూసుకుపోయే వీరే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 03 Horoscope | గ్రహాల సంచారం వలన...

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...