Illegal Moram Mining | అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Illegal Moram Mining | జిల్లాలో చీతా ఫోర్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేలా మెరుపు దాడులు చేస్తోంది. తాజాగా కమ్మర్‌పల్లి మండలం (Kammarpally Mandal) బషీరాబాద్ శివారులో గల కాడి చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అక్కడ అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించింది.

Illegal Moram Mining | ఐదు ట్రాక్టర్ల స్వాధీనం

తనిఖీల సందర్భంగా మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న ఒక జేసీబీ, మొరాన్ని రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వోకు అప్పగించారు.

Illegal Moram Mining | కఠిన చర్యలు తప్పవు

Illegal Moram Mining

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

 

ఇది కూడా చదవండి..: Yellareddy Development | ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *