అక్షరటుడే, ఎల్లారెడ్డి : Farmers Protest | రైతులు పండించిన జొన్నలను ఆంక్షలు లేకుండా కొనుగులు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) డిమాండ్ చేసింది. బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
జొన్నల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పిట్లం (Pitlam) మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కొనుగోలు అనంతరం ఓటీపీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బయోమెట్రిక్ కావాలంటే.. కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. భూమి కౌలుకు ఇచ్చిన వారు నగరాలు, ఇతర దేశాల్లో ఉంటే వారు వచ్చి వేలిముద్ర పెట్టడం ఎలా సాధ్యం అవుతుందన్నారు.
Farmers Protest | లారీ డ్రైవర్ల దోపిడీ
కొనుగోలు చేసిన జొన్నలను తరలించడానికి లారీ డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. క్వింటాల్‌కు రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని, దీనిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, కార్యదర్శి శంకర్ రావు, ఆనంద్ రావు, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Illegal Moram Mining | అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి


