అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar Counter | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pavan Kalyan)కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ పవన్ కల్యాణ్ తెలంగాణ మా అయ్య జాగీరే.. 4 కోట్ల మంది జాగీరి తెలంగాణ అన్నారు.
పవన్ మంగళవారం హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. తన సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నడిబొడ్డునే జనసేన జన్మించిందని గుర్తుచేసిన ఆయన.. “తెలంగాణలో జనసేన ఎందుకు?” అని ప్రశ్నించే విమర్శకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తెలంగాణకు వస్తే అడ్డుకుంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్పందించారు.
Ponnam Prabhakar Counter | పెయిడ్ ఆర్టిస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాటల్లో అహంకారం కనిపించిందన్నారు. తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకన్నారు. పవన పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. 4 నెలల క్రితం గెస్టుగా పవన్ కల్యాణ్‌ను ప్రభుత్వం ఆహ్వానించిందని గుర్తు చేశారు. ఆంధ్రలోనే గెలవలేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తావ్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.

Ponnam Prabhakar Counter | ఇక్కడేం పీకుతావు
ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు అని పొన్నం అన్నారు. తనకు ఏపీలోనే దిక్కు లేదని పవన్ అంగీకరించారని పేర్కొన్నారు. తెలంగాణకు ఎప్పుడైనా మద్దతిచ్చారా అని ప్రశ్నించారు. అమరవీరులకు ఏనాడైనా అండగా నిలిచారా అన్నారు. ‘‘నువ్వే అన్నావు కదా ఏపీలోనే పీకలేక పోతున్న.. ఇక్కడేం పీకుతా అని మళ్లీ ఎందుకు ఇదంతా”అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇవ్వడంలేదన్నారు.
Ponnam Prabhakar Counter | గుజరాత్‌లో పోటీ చేయు

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (Anirudh Reddy) మాట్లాడుతూ.. అమిత్‌షాపై ప్రేముంటే గుజరాత్‌లో పోటీచేయాలని పవన్‌కు సూచించారు. డిప్యూటీ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఉన్నావు, ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావని ప్రశ్నించారు. తెలంగాణ నరదిష్టి అని ఇందుకోసమే మాట్లాడారు కావొచ్చని మండి పడ్డారు. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ ఫ్లాప్ అయ్యాయని, ఆ డిప్రెషన్‌లోనే పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదని కొందరు అంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే తాను జడ్చర్లలో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ లాగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోలేదన్నారు. ఏపీ ప్రజలు గెలిపిస్తే వాళ్ళను వదిలేసి తెలంగాణలో ఉంటున్నారని పవన్‌పై మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదని అంటున్నారు
నేను జడ్చర్లలో పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచాను, పవన్ కళ్యాణ్ లాగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోలేదు
మరి నాకే ఎక్కువ అర్హత ఉన్నట్టు కదా
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి pic.twitter.com/LEg6Lpn6AC— ChotaNews App (@ChotaNewsApp) June 2, 2026
దీనిని కూడా చదవండి : Pawan Kalyan Press Meet | తెలంగాణ మీ అయ్య జాగీరా?: విమర్శకులపై కల్యాణ్ పవర్ ఫైర్


