అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఏకంగా 180 కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని మంగళవారం (జూన్ 02, 2026) హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని ఆసిఫ్ నగర్‌లోని మురాద్ నగర్‌కు చెందిన మహమ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రి (43) అలియాస్ అబ్దుల్లా అలియాస్ అల్తాఫ్‌గా పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

Chain Snatcher Arrest | చైన్ స్నాచింగ్‌నే వృత్తిగా..
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు చైన్ స్నాచింగ్ నే వృత్తిగా మార్చుకుని, బంగారు గొలుసుల దొంగతనానికి అలవాటు పడ్డాడు. తెలంగాణలో ఆయా ప్రాంతాలతోపాటు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన పలు కేసులలో ఇతగాడు నిందితుడిగా ఉన్నాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ చైన్ దొంగపై 14 నాన్ బెయిలబుల్ కేసులు ఉండటం గమనార్హం.
Chain Snatcher Arrest | బెంగళూరు.. ఆంధ్రప్రదేశ్..
నిందితుడు 2023లో మొఘల్ పుర, సైఫాబాద్, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
బంగారం దొంగతనం చేశాక కేసు నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు పారిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చేరుకున్నాడు. అక్కడ ఇతగాడు తన వృత్తి దుకాణం తెరిచాడు. చెన్నూర్, రాయచోటి స్టేషన్ పరిధిలోనూ దొంగతనాలు చేశాడని, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వివరించారు.


