అక్షరటుడే: బోధన్ : Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality)లో ఛైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత విభేదాలు చేరుకున్నాయి.
బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, వైస్ ఛైర్మన్‌గా ఎంఐఎం పార్టీ (MIM Party)కి చెందిన మీరు ఇలియాస్ అలీ ఉన్నారు. అయితే ఛైర్పర్సన్ భర్త శరత్ రెడ్డి కూడా కౌన్సిలర్‌గా గెలుపొంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. శరత్ రెడ్డి షాడో ఛైర్మన్‌గా అన్ని తానై వ్యవహరిస్తుండటంతో.. ప్రతిపక్ష కౌన్సిలర్లకు శరత్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
Bodhan Politics | గుర్తించడం లేదని..

అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష కౌన్సిలర్లను ఆహ్వానించడం లేదంటూ కనీసం తమను కౌన్సిలర్లుగా గుర్తించడం లేదంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బక్రీద్ సందర్భంగా పారిశుధ్య కార్మికులను మున్సిపాలిటీలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి అధికార పార్టీ కౌన్సిలర్లు తప్ప ప్రతిపక్షాలను పిలువ లేదంటూ ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ భర్త కొల్లిపాక బాలరాజ్ శరత్ రెడ్డిని ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్ వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. శరత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.తమను కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించాలని, కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
Bodhan Politics | కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం

కాంగ్రెస్ పార్టీ (Congress Party) వర్సెస్ ఎంఐఎం పార్టీ గొడవలు బోధన్ మున్సిపాలిటీలో తారాస్థాయికి చేరుకున్నాయి. వైస్ ఛైర్మన్‌కు మున్సిపాలిటీలో ప్రత్యేక గది కేటాయించాలని ఎంఐఎం పార్టీ అడుగుతుంటే సాధ్యం కాదని అధికార పార్టీ చెబుతుంది. దీంతో వారి మధ్య విభేదాలు భగ్గు మంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, అధికార కార్యక్రమాలకు కూడా తమకు ఆహ్వానం ఉండడం లేదని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అంటున్నారు.
ఇది కూడా చదవండి..: Pension Live Authentication | వినాయక్‌నగర్‌లో పింఛన్ లైవ్ అథెంటికేషన్
