అక్షరటుడే, కామారెడ్డి : Woman Death Kamareddy | నాలుగు రోజుల క్రితం కూలీ పని కోసం భర్తతో కలిసి వెళ్లిన మహిళ విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన కామారెడ్డి పట్టణ శివారులో బుధవారం వెలుగు చూసింది.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ (Palvancha) మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల(40) భర్త రాజంతో కలిసి ఆదివారం కామారెడ్డిలో కూలీ పనికి వచ్చింది. అయితే రాజంకు పని దొరికి శ్యామలకు దొరకలేదు. దీంతో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్లాలని చెప్పి ఆయన పనికి వెళ్లాడు. అయితే రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే శ్యామల ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
Woman Death Kamareddy | పోలీసులకు ఫిర్యాదు
కామారెడ్డి (Kamareddy)లో వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో శ్యామల కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సోమవారం కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం టర్నింగ్ వద్ద కలెక్టరేట్ వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. దానిని శ్యామల మృతదేహంగా గుర్తించారు. డీఎస్పీ మధుసూదన్, పట్టణ సీఐ నరహరి, దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. మృతదేహం రోడ్డు, రైల్వే ట్రాక్ పక్కన చెట్టు మొదటన కనిపించకుండా ఉండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ హత్యకు గురైందా..? లేక ఇతర ప్రమాదం ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Chain Snatcher Arrest | ఈ చైన్ స్నాచర్ మామూలోడు కాదు సుమా.. 180 కేసుల్లో నిందితుడు!
