Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni scam | సింగరేణిలో కుంభకోణం జరిగిందని బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ అన్నారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)​ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టాలని, మిలిటెంట్​ యాక్టివిటీ చేయాలని ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్​గూడ జైలులో ఉన్న బాల్క సుమన్​ను గురువారం కేటీఆర్​ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Singareni scam | రూ.15 వేల కోట్ల స్కామ్​

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన రూ.15 వేల కోట్ల స్కామ్‌ని బీఆర్ఎస్ బయటపెట్టిందని కేటీఆర్​ అన్నారు. సోలార్ టెండర్లలో జరిగిన అక్రమాలను హరీశ్ రావు వెలుగులోకి తెచ్చారని చెప్పారు.

brs 1

Singareni scam | వారిపై కేసులు ఉండవా..

బాల్క సుమన్ మీద ప్రభుత్వానికి ఎందుకంత కోపం అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఉద్యమంలో సుమన్‌పై 220 కేసులు పెట్టారని, ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తగలబెట్టాలని మాట్లాడితే చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై ఓ మాజీ ఎమ్మెల్యే దాడిచేస్తే శిక్షార్హం కాదా అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అక్కడి కంపెనీని తగలబెడతా అంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక నీతి, బాల్క సుమన్‌కు ఒక నీతి ఉంటుందా అని నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టినా సీఎం రేవంత్ రెడ్డి అన్యాయాలపై నిలదీస్తూనే ఉంటామన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana land rates revised | జూన్‌ 5 నుంచి కొత్త భూముల విలువలు.. ఖజానా నింపుకొనేందుకు ‘హేతుబద్ధత’ మంత్రం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *