అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయం చేస్తూ… ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. బ్లాక్ టీషర్ట్ రాహుల్ గాంధీ వేసుకోవడం కరెక్ట్… ఇక్కడ బీఆర్ఎస్ వేసుకోవడం తప్పు అని రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. అసెంబ్లీ నుంచి తాము బయటకు వెళ్లలేదని, పథకం ప్రకారం సీఎం సస్పెండ్ చేయించారన్నారు. సభలో ఉంటే కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాయని, అవినీతి బండారం బయటపెడతామని సభ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఎక్కడైనా ఒక్క రోజు సస్పెండ్ చేస్తారు.. కానీ, కావాలనే సెషన్ మొత్తం సస్పెండ్ చేశారన్నారు.
Harish Rao Counter | సీఎం చేసిందేమీ లేదు
తమపై సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు వచ్చి అన్ని ఆధారాలు ఇస్తామని స్పష్టంగా చెప్పామని హరీశ్ అన్నారు. మూడేళ్లలో ఎదురుదాడి, విచారణలు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నిషేధిత జాబితా భూముల అంశంలో బీఆర్ఎస్ చెప్పింది అక్షరసత్యమని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. ప్రభుత్వ తప్పిదం కారణంగా లక్షల కుటుంబాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Counter | సీఎం క్షమాపణ చెప్పాలి
తప్పు చేసిన అధికారులు, కలెక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదన్న మంత్రి పొంగులేటి (Ponguleti)పై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. సీఎం చెప్పిన ఉద్రిక్త పరిస్థితికి ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. ఆయన చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి ఇళ్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లే ప్రజలు అందరి సమస్య పరిష్కరించాలన్నారు.
Harish Rao Counter | కేసీఆర్‌పై బురద చల్లుతున్నారు
కేసీఆర్‌కు హైదరాబాద్‌లో తగిన ఇళ్లే లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూములు ఉన్నాయని బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి, భూ భారతిలో జరిగిన మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబానికి 308 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది
రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది
ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే… https://t.co/VU4LRfKZz7 pic.twitter.com/1qFXZDGLIm
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
దీనిని కూడా చదవండి : Xi Jinping Health | చైనా అధినేత జిన్‌పింగ్‌కు అనారోగ్యం.. రహస్యంగా ఆస్పత్రికి తరలింపు..?