Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ameerpet Fire Accident | నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైత్రివనం సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం అంతటా వ్యాపించాయి.

Ameerpet Fire Accident | ‘KSR ఫ్యాషన్స్’లో మొదలై..

మెట్రో పిల్లర్ నంబర్ A1043, శ్రీనివాసనగర్ వెస్ట్ సమీపంలో ఉన్న ‘KSR ఫ్యాషన్స్’ బట్టల దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. షాపులో అంతా వస్త్రాలు కావడంతో మంటలు అత్యంత వేగంగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న ‘హర్ష మెస్’ సహా ఇతర వ్యాపార సముదాయాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకోవడంతో రోడ్డు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక వ్యాపారులు, జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ameerpet.1

Ameerpet Fire Accident | ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరిన్ని వాటర్ ట్యాంకర్లను రప్పిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ప్రాథమికంగా ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ameerpet.2

Ameerpet Fire Accident | వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్..

అగ్ని ప్రమాదం , సహాయక చర్యల నేపథ్యంలో అమీర్‌పేట్ నుండి ఎస్సార్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమీర్‌పేట్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి వాహనదారులు సహకరించాలని కోరారు.

 

ఇది కూడా చదవండి:  BJP President comments | ‘కాక్రోచ్​ పార్టీ’ వెనక అర్బన్​ నక్సల్స్​.. బీజేపీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *