Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - జాతీయం

జాతీయంతెలంగాణ

Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్​ రెండో వారంలో రాష్ట్రంలోకి..

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 2:51 pm 2:51 pm
Srinivas Kolluri
Share
Southwest Monsoon

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Southwest Monsoon | అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్​ న్యూస్ ​చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడక్కడ అకాల వర్షాలు కురిసిన ఎండలు తగ్గకపోవడంతో ఉపశమనం లభించలేదు. దీంతో ప్రజలు తొలకరి పలకరింపు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వాతావారణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళంను తాకాయన్నారు.

దేశ రైతాంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి అడుగుపెట్టాయి. తాజాగా కేరళం తీరాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ప్రస్తుతం కేరళం అంతటా విస్తరించిన రుతుపవనాలు, దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను తాకాయి.. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Southwest Monsoon | రెండో వారంలో..

ప్రస్తుతం కేరళంలో విస్తరించిన రుతు పవనాలు జూన్​ రెండో వారంలో తెలంగాణను తాకనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్​ 10 నుంచి 14 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా గతేడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి మే 26న ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలో రుతుపవనాలు జూన్ 8–10 మధ్య వస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తొంది.

Southwest Monsoon | ఎల్​నినో ప్రభావం

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణలో తక్కువ పడుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు రూపొంచించుకోవాలని అధికారులు సూచించారు.

Southwest Monsoon | సాగు పనుల్లో బిజీ

దేశంలోకి నైరుతి ఆగమనంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దుక్కులు దున్నారు. కొంతమంది తుకాలు కూడా పోశారు. తొలకరి పలకరింపు తర్వాత వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు నిత్యం కళకళలాడుతున్నాయి.

ఐఎండీ మ్యాప్ ప్రకారం 2026 నైరుతి రుతుపవనాలు మే 16-17 తేదీల్లో అండమాన్‌లో ప్రవేశించి, జూన్ 4 నాటికి తెలుగు రాష్ట్రాలతో సహా ఒడిశా, బెంగాల్, ఈశాన్య ప్రాంతాలకు విస్తరించాయి. ఇందులో ఎరుపు గీతలు రుతుపవనాల సాధారణ రాకను, నీలం గీతలు ఈ ఏడాది వాస్తవ రాకను సూచిస్తున్నాయి. pic.twitter.com/nAICIlcEZi

— TG Govt Updates (@TGGovtUpdates) June 4, 2026

దీనిని కూడా చదవండి : TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్​.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే

TAGGED:agriculture newsIMD UpdateKerala MonsoonMonsoon ArrivalRainfall ForecastSouthwest Monsoon TelanganaTelangana farmerstelangana weather
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ameerpet Fire Accident Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్
Next Article Telangana Weather Alert Telangana Weather Alert | నేడు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో తుఫాను.. హైదరాబాద్‌కూ అలర్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Sanjay Comments
తెలంగాణ

Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

By Srinivas Kolluri
Fuel Price Hike
జాతీయం

Fuel Price Hike | ఇంధన ధరల పెంపుపై రాహుల్​ గాంధీ విమర్శలు

By Balla Sandeep Kumar
Rajinikanth Vijay
జాతీయంసినిమా

Rajinikanth Vijay | ఆయన సీఎం అయితే అసూయ పడేవాడిని.. రజనీకాంత్​ సంచలన వ్యాఖ్యలు

By Srinivas Kolluri
UP Storm Deaths
జాతీయం

UP Storm Deaths | యూపీలో తుపాను బీభత్సం.. 74 మంది మృతి!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.