అక్షరటుడే, వెబ్డెస్క్ : Petrol Tanker Overturns | హైదరాబాద్ – విజయవాడ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. హయత్ నగర్ (Hayath Nagar) సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా పడింది.
ఇండియన్ ఆయిల్ (Indian Oil)కు చెందిన పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న 2 కార్లను బలంగా ఢీకొంది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులోని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Petrol Tanker Overturns | పెట్రోల్ లీక్..
ప్రమాదం అనంతరం ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయింది. దీంతో మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదం జరుగుతుందని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్యాంకర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను రక్షించారు.
Petrol Tanker Overturns | ట్రాఫిక్ మళ్లింపు
ట్యాంకర్ బోల్తా పడటంతో జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకేజీ కావడం, ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాహనాలను దారి మళ్లించారు.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
హయత్ నగర సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా
గాయాలపాలైన కారులోని ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ pic.twitter.com/urI4Yv3A4S
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026
దీనిని కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్
