అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramalinga Reddy Resignation | కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వంలో రెండు రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆశించిన శాఖను కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఈ నెల 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వారిలో శాఖల కేటాయింపుపై రామలింగా రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఇరిగేషన్ శాఖను కేటాయించారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారు. ఈ క్రమంలో తనకు వేరే శాఖ ఇవ్వడంతో అసంతృప్తితో రాజీనామా చేశారు. ఇవాళ బెంగళూరుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నారు. ఖర్గే రాజ్యసభ నామినేషన్‌కు ఆయన హాజరు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ముందుకు రామలింగా రెడ్డి పంచాయితీ రానుంది.

Ramalinga Reddy Resignation | మనస్సాక్షికి వ్యతిరేకంగా..
నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయలేను కాబట్టి నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని బెంగళూరులో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో రామలింగారెడ్డి అన్నారు. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ కావాలని, కానీ దానికి బదులుగా భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మంత్రిగా నియమించారని అన్నారు. ఈ అవమానాన్ని నేను ఇంకెంతకాలం భరించగలను. నా ముందు ఇంకేం అవకాశాలు ఉన్నాయి అని ప్రశ్నించారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా..
కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వంలో రెండు రోజుల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆశించిన శాఖను… pic.twitter.com/sc64n0uDoL
— Akshara Today | Telugu News (@aksharatoday) June 5, 2026
ఇది కూడా చదవండి..: RBI Monetary Policy | అందరి చూపు ఆర్బీఐ వైపు..
