Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

GGH Nizamabad | అరుదైన శస్త్రచికిత్సకు వేదికగా నిలిచిన నిజామాబాద్ జీజీహెచ్​

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 3:46 pm 3:46 pm
Shashi kiran Mottala
Share
GGH Nizamabad |

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Nizamabad | జీజీహెచ్​ నిజామాబాద్​లో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలోని గుండె వైద్య సేవల విభాగం పీటీసీఏ (పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ) (PTCA Surgery) సర్జరీ చేసి ఓ ప్రాణాన్ని కాపాడింది.

GGH Nizamabad | గుండెపోటు వచ్చిన రోగికి అత్యవసరంగా..

ggh5

నగరంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రికి(GGH) 65ఏళ్ల వయస్సున్న బురాజీ అనేవ్యక్తి మంగళవారం రాత్రి తీవ్రమైన ఛాతినొప్పితో(Heart Attack Treatment) వచ్చాడు. వైద్యులు పరీక్షించి ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (Acute MI)తో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. రోగి పరిస్థితిని గుర్తించిన కార్డియాలజీ బృందం వెంటనే థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించింది. అనంతరం గురువారం నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీ (RCA)లో (Coronary Angioplasty) తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్డియాలజీ బృందం విజయవంతంగా పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ పీటీసీఏ (PTCA), స్టెంట్ అమరిక చేపట్టింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, కోలుకుంటున్నారు.

GGH Nizamabad | అత్యాధునిక శస్త్రచికిత్స చేయడంపై..

ggh4

జీజీహెచ్ నిజామాబాద్‌లో మొట్టమొదటి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియను కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్​ల బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ బీవీ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు, కార్డియాలజీ బృందాన్ని, క్యాథ్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్, సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలను స్థానికంగానే అందించడంలో ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఇకపై గుండెపోటు రోగులకు అత్యవసర చికిత్సలు, స్టెంట్ ప్రక్రియలు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో అత్యవసర గుండె వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ నిజామాబాద్ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై కవిత ఫైర్.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

TAGGED:Cardiology TeamCoronary AngioplastyEmergency Cardiac CareHeart Attack Treatmentnizamabad GGHPTCA SurgeryStent ProcedureTelangana Health News
Previous Article Attapur Murder Case Attapur Murder Case | కళ్లముందే కన్నతల్లి దారుణ హత్య.. అత్తాపూర్ ఘటనపై కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు
Next Article SI Extramarital Affair SI Extramarital Affair | హోంగార్డు భార్యతో ఎస్సై వివాహేతర సంబంధం.. మహిళ భర్త ఆరోపణ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Welfare Schemes Implementation |
నిజామాబాద్

Welfare Schemes | ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి: షబ్బీర్ అలీ

By Shashi kiran Mottala
CPO Teachers Issue
నిజామాబాద్

CPO Teachers Issue | సీపీవోలుగా ఉపాధ్యాయులను నియమించడం సమంజసం కాదు

By Shashi kiran Mottala
Kamareddy Heat Wave |
నిజామాబాద్

Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

By Shashi kiran Mottala
Highway Robbery Arrest |
క్రైంనిజామాబాద్

Highway Robbery gang Arrest | దారి దోపిడీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.