Police Transfers | పలువురు పోలీస్​ అధికారుల బదిలీ

Srinivas Kolluri
Telangana DSP Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు పోలీస్​ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) ఉత్తర్వులు చేశారు.

Police Transfers | డీఎస్పీ ఆనందరెడ్డి

ఇంటెలిజెన్స్​ విభాగంలో డీఎస్పీ (DSP)గా కొనసాగుతున్న ఆనందరెడ్డిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రాజును సీఐడీ విభాగంలో డీఎస్పీగా బదిలీ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు వారిని వెంటనే రిలీవ్​ చేయాలని డీజీపీ ఆదేశించారు. సదరు అధికారులు కొత్త పోస్టింగ్​ల్లో రిపోర్టు చేయాలన్నారు. ఇటీవల సైతం పలువురు ఐపీఎస్​ అధికారుల బదిలీలు అయ్యాయి. తాజాగా మరోసారి బదిలీలు చేపట్టడం గమనార్హం.

dgp

ఇది కూడా చదవండి : CI & SI Caught by ACB | స్టేషన్​ బెయిల్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *