Telangana RTC Strike | చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్!

Naresh Chandan
Telangana RTC Strike 1

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana RTC Strike | తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ జేఏసీ తమ తదుపరి కార్యాచరణ ప్రకటించింది. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు వెల్లడించింది.

తెలంగాణ ఆర్టీసీ మంగళవారం రాత్రి జేఏసీతో చర్చలు జరిపింది. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అధికార కమిటీ కోరింది.rtc bus

Telangana RTC Strike | విలీనం తప్ప..

ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ విలీన డిమాండ్​ తప్ప.. మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆర్టీసీ జేఏసీతో అధికారుల కమిటీ తెలిపింది. వారి ప్రతిపాదనను జేఏసీ నాయకులు నిరాకరించడంతో చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెకు దిగేందుకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్టీసలు బస్సులు తిరగవు.

Telangana RTC Strike | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనుండటంతో ప్రజారవాణాకు ఇబ్బందులు కలగకుండా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని RTOలకు రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు డ్రైవర్లు, వాహనాల వివరాలు సేకరించాలని, తద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. GHMC పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Vijay Political Comments | నేను నటుడినే.. కానీ, మీరే అసలైన రాజకీయ నటులు : ప్రత్యర్థులపై దళపతి విజయ్ ఫైర్

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *