అక్షరటుడే, వెబ్‌డెస్క్: Peddi Director Apology | పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు (Director Buchi Babu) మహిళలకు క్షమాపణలు చెప్పారు. రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి.
సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంతో పాటు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చాయి. పలువురు ప్రముఖులు సైతం ఆ సీన్లను తప్పుపడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కోరుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Peddi Director Apology | మహిళలపై గౌరవం ఉంది
సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికే గానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, గౌరవానికి భంగం కలిగించడానికి కాదని బుచ్చిబాబు అన్నారు. ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మహిళల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.. ఏ పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు.
సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించి ఉంటే.. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను మార్చబోతున్నట్లు ప్రకటించారు.మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, సెన్సిటివిటీస్‌కు బాధ్యత వహిస్తామని.. భవిష్యత్తులో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా చూపిస్తామని బుచ్చిబాబు హామీ ఇచ్చారు. కొన్ని సున్నితమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Bandla Ganesh | నీకెందుకురా.. ప్రకాశ్‌రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్