Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - సినిమా

సినిమా

Peddi Box Office | బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Shivam nagarani
Last updated: June 7, 2026, 12:34 pm 12:34 pm
Shivam nagarani
Share
Peddi Box Office

అక్షరటుడే వెబ్‌డెస్క్: Peddi Box Office | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, మొదటి ఆట నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన మొదటి మూడు రోజుల అధికారిక వసూళ్ల వివరాలను తాజాగా ప్రకటించింది.

Peddi Box Office | మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ క్రాస్..

ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 236.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ కలెక్షన్లతో సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ. 200 కోట్ల మైలురాయిని చాలా సులువుగా దాటేసింది.
peddi.1

 

Peddi Box Office | టార్గెట్ రూ. 300 కోట్లు..

ప్రస్తుతం థియేటర్ల వద్ద కనిపిస్తున్న విపరీతమైన క్రేజ్, కలెక్షన్ల జోరును బట్టి చూస్తే, ఈ చిత్రం నాలుగో రోజు నాటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మెగా పవర్ స్టార్ కెరీర్‌లోనే మరిన్ని భారీ రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

peddi.2

Peddi Box Office | భారీ తారాగణం..

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక వినూత్న స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

మూడో రోజు స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచిన పెద్ది

మూడు రోజులకు గాను 236.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ప్రకటించిన టీం

ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం…#Peddi #PeddiCollections #RamCharan #Tollywood pic.twitter.com/rl4VUgeFfY

— NTV Breaking News (@NTVJustIn) June 7, 2026

ఇది కూడా చదవండి:  Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

TAGGED:AR Rahman MusicBuchi Babu SanaJanhvi Kapoorlatest newsPeddi Box OfficePeddi CollectionsPeddi Worldwide GrossRam Charan MovieTelugu cinema newstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Giant Fish Catch Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప
Next Article Godavari Kaveri Link Godavari Kaveri Link | కొత్తకుట్రకు చంద్రబాబు తెర.. హరీశ్​రావు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Punjab Political Crisis
జాతీయం

Punjab Political Crisis| రాఘవ్ చద్దా ‘రివర్స్ అటాక్’.. ఒకప్పటి పార్టీపైనే రాష్ట్రపతికి కంప్లైంట్!

By Shivam nagarani
Cancer Drug Smuggling
జాతీయం

Cancer Drug Smuggling|క్యాన్సర్ మందుల అక్రమ రవాణాపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. కేంద్రం, CDSCO లకు కోర్టు నోటీసులు

By Shivam nagarani
Hyderabad Spa Raids
హైదరాబాద్

Hyderabad Spa Raids | స్పాల ముసుగులో వ్యభిచారం.. 113 కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసిన వందల మంది పోలీసులు

By Shivam nagarani
Bengal CM Race
జాతీయం

Bengal CM Race|అమిత్ షా కోల్‌కతా ల్యాండింగ్.. బెంగాల్‌ పీఠంపై కూర్చునేదెవరు?

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.