PMJ Jewellery Case | పీఎంజే జువెల్లరీ కేసులో రెండు గన్స్​ స్వాధీనం

కరీంనగర్​లోని పీఎంజే జువెల్లరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన రెండు గన్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PMJ Jewellery Case | కరీంనగర్​ (Karimnagar)లోని పీఎంజే జువెల్లరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన రెండు గన్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు గురించి ఆదివారం సీపీ గౌస్​ ఆలం (CP Ghouse Alam) మీడియాతో మాట్లాడారు.

కరీంనగర్​లోని పీఎంజే జువెల్లరీ షోరూమ్‌లో మే 3న దోపిడీ జరిగింది. దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సీపీ మాట్లాడుతూ.. అదృశ్యమైన బంగారం, వజ్రాభరణాల విషయంలో నిందితులు తమ వాంగ్మూలాలను మారుస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని గౌష్ ఆలం ఆదివారం తెలిపారు.

cp 3

PMJ Jewellery Case | వెలిచాల బైపాస్​ సమీపంలో..

నాలుగు రోజుల కస్టడీ సమయంలో వెలిచాల బైపాస్ సమీపంలోని పొదల్లో దాచి ఉంచిన రెండు పిస్టళ్లను, అటవీ ప్రాంతం వద్ద పడేసి వెళ్ళిన ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో, మరో కీలక నిందితుడిని (A-10) బీహార్‌లో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై అతన్ని కరీంనగర్‌కు తరలిస్తున్నారు. మిగిలిన నిందితులు, దోచుకున్న ఆభరణాల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు నిందితులను మరోసారి కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. కాగా బీహార్​కు చెందిన ముఠా ఈ దోపిడీ చేసింది.

 

దీనిని కూడా చదవండి : Telangana Academic Calendar | తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. సెలవుల పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *