Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఏర్గట్ల​ మండలంలోని తాళ్లరాంపూర్​ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1991-92 బ్యాచ్​ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్ (​ఏర్గట్ల): Alumni Reunion | మండలంలోని(Bheemgal) తాళ్లరాంపూర్​ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Tallarampur ZPHS) 1991-92 బ్యాచ్​ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామ శివారులోని ఓ ఫంక్షన్​ హాల్​లో కార్యక్రమం జరిగింది.

Alumni Reunion | దశాబ్దాల తర్వాత..

దశాబ్దాల కాలం తర్వాత చిన్ననాటి మిత్రులంతా (Former Students) ఒకే వేదికపై కలవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, తమ పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను, చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ మురిసిపోయారు. తమకు క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన గురువులను పూర్వ విద్యార్థులు ఈ వేదికపై ఘనంగా సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, తమతో పాటు చదువుకుని, ప్రస్తుతం ఆరోగ్య శాఖలో(Health Department) డివిజన్ స్థాయిలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్న డాక్టర్ రవీందర్‌ను తోటి విద్యార్థులంతా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గంగాసాగర్, గణేష్, నరేందర్, రాజారామ్ యాదవ్, ప్రభాకర్, నర్మద, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

freindas

ఇది కూడా చదవండి: Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *