Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్​లైన్​ షాపింగ్​ మోజులో చోరీలు

జల్సాల కోసం మైనర్లు అడ్డదారి తొక్కారు. ఆన్​లైన్​ షాపింగ్​కు అలవాటు పడ్డ వీరు చోరీలకు పాల్పడ్డారు. తాడ్వాయి మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Minors Theft | చూడటానికి వారిద్దరు మైనర్లే.. కానీ వారు చేసే పనులు మాత్రం ప్రొఫెషనల్ దొంగలను మించిన చోరీలు. ఆన్​లైన్​లో షాపింగ్ (Online Shopping) చేయడానికి, జల్సాలకు అలవాటు పడ్డ ఇద్దరు మైనర్లు ఓ ఇంట్లో చోరీకి పాల్పడి ఉడాయిస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా గ్రామస్తులకు చిక్కారు.

Minors Theft | తాడ్వాయి మండలంలో..

తాడ్వాయి(Tadwai) మండలం దేవాయిపల్లి గ్రామంలో ఇద్దరు మైనర్లు చోరీ కథ నాటకీయంగా ముగిసింది. ఆన్‌లైన్ షాపింగ్ పిచ్చిలో పడిన ఆ ఇద్దరూ అడ్డదారి తొక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ మహిళ రాత్రి వేళ ఇంటికి తాళం వేసి ఆరుబయట పడుకుంది. ఇదే అదనుగా భావించిన ఇద్దరు మైనర్లు, ఆమె దిండు కింద ఉన్న తాళం చెవిని మెల్లగా తస్కరించారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఇనుప పెట్టె ఎత్తుకొచ్చారు. పని పూర్తయ్యాక దొరక్కూడదని తాళాన్ని యథాస్థానంలో పెడుతుండగా కథ అడ్డం తిరిగింది. తాళం దిండు కింద పెడుతున్న సమయంలో మహిళకు చేయి తగలడంతో ఉలిక్కిపడి లేచింది. దాంతో ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Minors Theft | పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

పోలీసుల (Tadwai Police) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కు బానిసలై ఖరీదైన వస్తువుల కోసం చోరీలకు అలవాటు పడ్డామని మైనర్లు అంగీకరించారు. చోరీ చేసిన డబ్బుతో విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నట్లు తేలింది. పోలీసులు మైనర్ల నుంచి రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ (Juvenile Justice Act) ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, ఆన్‌లైన్ మోజులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

arrest

ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *