అక్షరటుడే, ఆర్మూర్: Urea App Protest | యూరియా బుకింగ్ యాప్‌ను తక్షణమే తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలం (Armoor Mandal) అంకాపూర్ గ్రామ రైతులు మంగళవారం 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Urea App Protest | యాప్‌తో నానా ఇబ్బందులు
రైతులు మాట్లాడుతూ.. యూరియా యాప్ (Urea App)తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా చల్లే సమయం ఆసన్నమైందని తాము పొలంలో పని చేసుకోవాలా లేక యూరియా కోసం లైన్ కట్టాలా అనే అయోమయ స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) తీసుకొచ్చిన యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు వారి అవసరాలకు అనుగుణంగా యూరియాను అందించాలని కోరారు. రాస్తారోకో కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాడంతో ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, రైతు నాయకులు నవీన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్లైన్ షాపింగ్ మోజులో చోరీలు..
