Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం : మంత్రి అడ్లూరి

నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman Kumar) స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రాంగణం సమీపంలోని డంపింగ్ యార్డును కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి పరిశీలించారు.

డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, ఈ ప్రాంతంలో కొన్ని నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డంపింగ్ యార్డు తరలింపు అత్యవసరమైందని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రూ.20 కోట్ల వ్యయంతో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం ఆధునిక హాస్టల్ నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో గురుకుల విద్యార్థులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

Nizampet Dumping Yard | పెట్రోలింగ్​ చేపట్టాలి

డంపింగ్ యార్డు పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయన్న ప్రజల మంత్రికి వివరించారు. డీసీపీతో మాట్లాడి ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టి నెల రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు.

దీనిని కూడా చదవండి :  Asifabad Forest Tension | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఆసిఫాబాద్​ జిల్లాలో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *