అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh vs Srilanka | బంగ్లాదేశ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళ జట్టు మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 45.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంక బౌలర్లు (Sri Lankan Bowlers) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. జుయిరియా ఫెర్దౌస్ కేవలం 2 పరుగులకే ఔట్ కాగా, షార్మిన్ అక్తర్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరింది. అయితే సర్మిన్ సుల్తానా 25 పరుగులు చేసి ఔటయింది.క్రీజులో కుదురుకుంటుంది అనుకుంటున్న సమయంలో పెవీలియన్ బాట పట్టింది .
Bangladesh vs Srilanka | సిరీస్ సమం చేస్తారా…
అయితే జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ నిగర్ సుల్తానా (Captain Nigar Sultana) బాధ్యతతో అద్భుతంగా పోరాడింది. 101 బంతుల్లో 58 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టింది. ఆమె ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్స్ కూడా ఉన్నాయి. ఆమెకు తోడుగా షోర్నా అక్తర్ (16), రితు మోని (17), నహిదా అక్తర్ (20) కొంత సహకారం అందించినా… పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాలేదు. దీంతో బంగ్లా జట్టు భారీ స్కోరు చేయలేక 45.5 ఓవర్లలోనే 165 పరుగులకి ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి అతపత్తు కీలక వికెట్లు తీసి బంగ్లా జట్టుని ఇబ్బంది పెట్టింది. అలాగే మదరా, మీపేజ్, రణవీర, దిల్హరి బౌలర్లు సమయానికి వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను 165 పరుగులకే కట్టడి చేశారు.

Bangladesh vs Srilanka | సమం అవుతుందా..
మొత్తం 45.5 ఓవర్లలో 165 పరుగులు చేసిన బంగ్లాదేశ్ జట్టు, ఇప్పుడు బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోగలదా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో బంగ్లా విజయం సాధించి సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు గెలిస్తే సిరీస్ బంగ్లాదేశ్ జట్టు సొంతమవుతుంది. లేదంటే సిరీస్ సమం అవుతుంది. ఇక మూడో వన్డేలో గెలిచిన వారు సిరీస్ దక్కించుకుంటారు.
ఇది కూడా చదవండి..: Ishan Kishan Record | ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. డ్రెస్సింగ్ రూమ్‌లో గట్టిగా మాట్లాడే కెప్టెన్‌ని కానంటూ కామెంట్స్

