Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్​​ బస్సు.. సీపీ ఆఫీస్​ వద్ద ట్రాఫిక్​జాం

టీజీఎస్​ఆర్టీసీ ఎలక్ట్రిక్​​ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

shashi kiran Mottala

నిజామాబాద్​ సిటీ : Nizamabad Electric Bus | టీజీఎస్​ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్​​ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన నగరంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

Nizamabad Electric Bus | సీపీ కార్యాలయం ఎదుట..

Nizamabad Electric Bus

నిజామాబాద్​ డిపో–2కు చెందిన బస్సు నగరంలోని సీపీ కార్యాలయం ఎదుట నిలిచిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు (Traffic police) వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూశారు. బస్సులో ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.

ఇది కూడా చదవండి..: BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *