అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme P4R 5G | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో మోడల్‌ను రిలీజ్ చేసింది. పీ4ఆర్ పేరుతో బుధవారం(జూన్ 10న) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో విడుదల చేసిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీతోపాటు అధునాతన చిప్‌సెట్ అమర్చారు. ఫ్లిప్ కార్ట్ (Flipkart), కంపెనీ అఫీషియల్ సైట్ లలో ఈనెల 17నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
Realme P4R 5G | డిస్‌ప్లే ఫీచర్లు..
6.8 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఐపీ 65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో వేగంగా చల్లబరిచే ఎయిర్ ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో కూడా ఈ ఫోన్ వేడెక్కకుండా ఇది చూస్తుంది.
Realme P4R 5G | కెమెరా సెటప్..
50 ఎంపీ డ్యుయల్ ఏఐ కెమెరా అమర్చారు. ఇందులో పోర్ట్రెయిట్ గ్లో, ఎరేజర్ వంటి ఏఐ ఫీచర్లున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 ఎంపీ సెన్సార్ ఇచ్చారు.
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యÖఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
Realme P4R 5G | బ్యాటరీ సామర్థ్యం..
8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఈ ఫోన్ కేవలం 8.8ఎంఎం స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, 6.5 డబ్ల్యూ రివర్స్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే నాన్‌స్టాప్‌గా 12.5 గంటలపాటు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడొచ్చని, 26.9 గంటల నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుందని, 157.4 గంటలపాటు మÖ్యజిక్ వినొచ్చని, 21.6 గంటలపాటు యÖట్యూబ్ చూడొచ్చని కంపెనీ చెబుతోంది.
బ్యాటరీ ఏడేళ్లపాటు మన్నుతుందని ప్రకటించింది.
వేరియంట్లు, ధరలు..
లావెండర్ గ్లేర్, సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్ రంగుల్లో మÖడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 18,999.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 20,999.
6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 22,999.
కార్డ్ ఆఫర్స్ : ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2 వేల తక్షణ డిస్కౌంట్‌తోపాటు 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2,170 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | భారీ లాభాల్లో సూచీలు
