Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - ఆంధ్రప్రదేశ్​

ఆంధ్రప్రదేశ్​

Vizag Steel Plant Accident | స్టీల్ ప్లాంట్​లో వరుస ప్రమాదాలు.. ప్రభుత్వ తీరుపై జగన్ ఫైర్

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Shivam nagarani
Last updated: June 10, 2026, 3:03 pm 3:03 pm
Shivam nagarani
Share
Vizag Steel Plant Accident

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vizag Steel Plant Accident | విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆయన విమర్శించారు.

Vizag Steel Plant Accident | ప్రమాదానికి కారణం..

తాజాగా జరిగిన ప్రమాదంపై స్పందించిన జగన్, ఇది కేవలం ఉద్యోగుల తప్పిదం కాదని స్పష్టం చేశారు. ముడి సరుకుల మిక్సింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్లే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయ్యిందని, సరైన ప్రమాణాలు పాటించకపోవడమే ఈ దుర్ఘటనలకు కారణమని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

Vizag Steel Plant Accident | లోకేశ్ వ్యాఖ్యలపై మండిపాటు..

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో మంత్రి నారా లోకేశ్ తీరును జగన్ తప్పుబట్టారు. “కార్మికులకు కంపెనీ నుంచి రావాల్సిన పరిహారాన్నే ప్రభుత్వం ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదు” అని జగన్ మండిపడ్డారు. మంత్రి లోకేశ్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, కోటి 72 లక్షల పరిహారం అనేది కార్మికుల హక్కని ఆయన గుర్తుచేశారు.

Vizag Steel Plant Accident | పెంటయ్య కుటుంబానికి అన్యాయం..

గతంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పెంటయ్య కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “14 నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదు. పైగా ఫైల్ కనిపించడం లేదని సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం?” అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే బాధితులు నష్టపోతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!

TAGGED:Andhra Pradesh politicsCompensation IssueIndustrial Accident Indiajagan mohan reddylatest newsNara LokeshSteel Plant Accidenttelugu newsVizag Steel PlantWorker Safety
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Government Schools Government Schools | ప్రైవేట్​కు​ ధీటుగా ప్రభుత్వ బడులు.. ప్రీ ప్రైమరీతో మహర్దశ
Next Article DCA Raids DCA Raids | కండల కోసం ఇంజెక్షన్ల వినియోగం.. జిమ్​లపై అధికారుల చర్యలు
1 Comment
  • Pingback: Hyderabad Rain Traffic | చినుకు పడినా వణుకుడే..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Harish Rao Criticism
తెలంగాణ

Harish Rao Criticism | కావాలంటే పేరు మార్చుకోండి.. బడుల అభివృద్ధిని ఆపకండి: హరీశ్ రావు

By Shivam nagarani
Mamata Banerjee Statement
జాతీయం

Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!

By Shivam nagarani
Anantha Babu Absconding
ఆంధ్రప్రదేశ్​

Anantha Babu Absconding | సాక్షుల బెదిరింపు కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ.. పోలీసుల ముమ్మర గాలింపు

By Srinivas Kolluri
Amaravati Projects
ఆంధ్రప్రదేశ్​

Amaravati Projects | ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.1,208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.