Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..రేవంత్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్

హైదరాబాద్ ఎవరి సొంత జాగీరు కాదని, తనను తెలంగాణకు రానివ్వబోమనే వాళ్లకు గట్టి సమాధానం చెబుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు.

Shivam nagarani
Last updated: June 10, 2026, 8:14 pm 8:14 pm
Shivam nagarani
Share
Pawan Kalyan Hyderabad

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి సొంత జాగీరు కాదని, తనను తెలంగాణకు రానివ్వబోమనే వాళ్లకు గట్టి సమాధానం చెబుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను తీసుకువచ్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆ లెక్కన చూస్తే దేశాన్ని ఏకం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్‌కు చెందినవారేనని గుర్తు చేశారు. దేశాన్ని విడదీసేలా మళ్లీ ఉత్తర-దక్షిణ కోణంలో మాట్లాడొద్దని రేవంత్ రెడ్డికి పవన్ హితవు పలికారు.

Pawan Kalyan Hyderabad | కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ..

తనను హైదరాబాద్ రావద్దంటూ బెదిరిస్తున్న శక్తులపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ కాకుండా, ఒక జాతీయ పార్టీకి చెందిన వారు ఇలా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ కొందరు అల్లరి మూకలను తనపైకి పంపుతున్నారని ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తనను హైదరాబాద్ రావద్దని చెబితే.. అప్పుడు తాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ మాట చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి అసలు దక్షిణ భారతదేశంతో ఏం సంబంధం ఉందని, ఆయన ఇక్కడి వాడు కాదు కదా అని తాను కూడా అనాల్సి వస్తుందంటూ కాంగ్రెస్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సొంత దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, దీనికోసం ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

pawan.1 3

Pawan Kalyan Hyderabad | తెలంగాణ రాజకీయంపై క్లారిటీ..

తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో తనకు బలమైన క్యాడర్, యువత మద్దతు ఉందని చెప్పారు. తనకు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ.. తమ నాయకులు, క్యాడర్ ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పవన్ వివరించారు.

Pawan Kalyan Hyderabad | నక్సలైట్‌గా మారాలనుకున్నా..

ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన టీనేజ్ రోజులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన వయసు పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ల సమయంలో సమాజంలోని అసమానతలను చూసి తీవ్రంగా చలించిపోయానని చెప్పారు. ఆ సమయంలో తుపాకీ పట్టి నక్సలైట్‌గా మారిపోవాలని అనుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే, ఆ దశలో తన అన్న చిరంజీవి తనను గమనించి, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం వైపు నడిపించారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు

 

TAGGED:Congress vs Janasenahyderabad politicslatest newsPawan Kalyanpolitical controversyRahul GandhiRegional Politics IndiaRevanth ReddyTelangana Politicstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article DGP Anand Comments DGP Anand Comments | ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. డీజీపీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు
Next Article Bada Ram Mandir | Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్​ ఆలయ భూముల కౌలు ప్రక్రియ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kavitha Education Demands
తెలంగాణ

Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత

By Shivam nagarani
Cockroach Janata Party
జాతీయం

Cockroach Janata Party| కాక్రోచ్ జనతా పార్టీ’ క్రేజ్.. 2 కోట్లు దాటిన ఫాలోవర్లు!

By Shivam nagarani
SI Love Fraud
తెలంగాణహైదరాబాద్

SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!

By Naresh Chandan
Gadal Srinivasa Rao
తెలంగాణ

Gadal Srinivasa Rao | తెలంగాణ జనసేనలోకి చేరిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.